దస్తురాబాద్: భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘ టన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మున్యాల పంచాయతీ పరిధి పెద్దూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు పటేల్ స్నేహలతతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొన్నేళ్లుగా భర్త తరచూ మానసికంగా, శారీరకంగా భార్యను వేధింపులకు గురిచేసేవాడు. పుట్టింటి వారికి పదేపదే విన్నవించినా సర్ది చెప్పారు. ఈ క్రమంలో విసుగుచెందిన స్నేహలత సోమవారం కడెం లెఫ్ట్ కెనాల్‌లో దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కెనాల్ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు తండ్రి వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


