డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు

Jul 30 2026 12:39 AM | Updated on Jul 30 2026 12:39 AM

కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ నూతన సీఈవోగా చండా విశ్వేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన శ్రీధర్‌రెడ్డి గతేడాది సెప్టెంబర్‌లో నిజామాబాద్‌ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలువురు ఇన్‌చార్జీలతో పాలన సాగింది. రెగ్యులర్‌ నియామకం కోసం ఇటీవల ప్రక్రియ నిర్వహించగా ఆరుగురు అధికారులు హాజరయ్యారు. వారిలో మెదక్‌ జిల్లా సహకార బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న విశ్వేశ్వర్‌ను నియమిస్తూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్‌చార్జి సీఈవో రవి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన కలెక్టర్‌ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement