రుషభనాథుని శిథిల శిల్పం గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

రుషభనాథుని శిథిల శిల్పం గుర్తింపు

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలోని చాందా (టి)శివారులో 9వ శతాబ్దం నాటి తొలి జైన తీర్థంకరుడు రుషభనాథుని శిథిల శిల్పాన్ని తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు రొడ్డవార్‌ పృథ్విరాజ్‌ మంగళవారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జైన మతానికి సంబంధించిన అనేక పురాతన విగ్రహాలు ఒక్కొక్కటిగా లభ్యం అవుతున్నాయన్నారు. ఇప్పటి కే ఇక్కడ 17వ తీర్థంకర కుంతనాథ, పార్శ్వనాథ వి గ్రహాలు లభించాయన్నారు. వీటితో పాటు జైన మ తానికి సంబంధించిన సుమారు 50 వరకు శిథిల వి గ్రహాలు లభించడం ప్రత్యేకమన్నారు. ఆయన వెంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అక్షయ, షె రిల్‌, సాయిరాజ్‌ కాంబ్లే, శ్రేయ, మమత ఉన్నారు.

రుషభనాథుని శిథిల శిల్పం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement