కలెక్టర్‌ చొరవతో పాఠశాలలో చేరిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ చొరవతో పాఠశాలలో చేరిన విద్యార్థులు

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

ఇంద్రవెల్లి: కలెక్టర్‌ రాజర్షిషా చొరవతో బడీడు పిల్ల లు పాఠశాలలో చేరారు. మంగళవారం ఉట్నూర్‌ పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి వద్ద తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తున్న పిల్లలను చూసిన కలెక్టర్‌ జిల్లా విద్యాధికారి మిల్కాకు ఫోన్‌ చేసి బాలకార్మికులను వెంటనే పాఠశాలలో చేర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన డీఈవో మండల అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంద్రవెల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ కోఆర్డినేటర్‌ పురుసోత్తం సాయినగర్‌కు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం సునీతను ఇంద్రవెల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆరోతరగతిలో సునీల్‌ను ఎంపీపీఎస్‌లో 5వ తరగతిలో చేర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement