‘సాయ్‌’ హాకీ అకాడమీకి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘సాయ్‌’ హాకీ అకాడమీకి ఎంపిక

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

ఉట్నూర్‌రూరల్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) హాకీ అకాడమీకి ఉట్నూర్‌ గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులు 9 మంది ఎంపికై నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంపికై న పెందుర్‌ ధనరాజ్‌, ఉర్వెత జంగు, బుక్య కిరణ్‌, ఆత్రం శంభు, రాథోడ్‌ ధనరాజ్‌, జాదవ్‌ సాయి ప్రసాద్‌, చౌహాన్‌ సాయిరామ్‌, ఆత్రం జగ్జీవన్‌, కోట్నాక్‌ అజయ్‌కుమార్‌ను మంగళవారం ఐటీడీఏ పీవో మంద మకరందు అభినందించారు. ఐటీడీఏ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో గోడం చందన్‌, ఏపీవో పీవీటీజీ భాస్కర్‌, ఏసీఎంవో జగన్‌, ఎస్‌వో పార్థసారథి, హెచ్‌ఎం ఉత్తం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement