తాండూర్: భూ తగాదాలో మండలంలోని బోయపల్లికి చెందిన మాసాడి భాస్కర్‌పై దాడి చేసిన ఘటనలో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై ప్రసాద్‌రావు తెలిపారు. ఈ నెల 12న భాస్కర్‌పై కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. దాడి చేసిన పూసాల ప్రశాంత్, సిద్ధం శివగణేశ్‌ను అరెస్ట్ చేసి మంగళవారం బెల్లంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


