ఏజెన్సీలో కేటుగాళ్లు! | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో కేటుగాళ్లు!

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

● గతేడాది ఏప్రిల్‌ 7న ఆన్‌లైన్‌ స్టాక్‌ మార్కెట్‌ పేరు అధిక లాభాలు ఇప్పిస్తామని ఉట్నూర్‌కు చెందిన సయ్యద్‌ జావిద్‌, కొత్తపెల్లి గంగాధర్‌ 25 మంది వద్ద ఏకంగా రూ.1 కోటి 19 లక్షల మోసానికి పాల్పడ్డారు. ● ఈ ఏడాది ఏప్రిల్‌ 28న మండలంలోని భూపేట్‌, గంగన్నపేట్‌, దంతన్‌పల్లి గ్రామాలకు చెందిన నలుగురు రైతుల వద్ద నుంచి సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు ఇప్పిస్తానని నిందితుడు కామెర చంద్రమౌళి రూ.12 లక్షలు వసూలు చేశాడు. ● మే 31న ఉట్నూర్‌లో బ్యాంకు రుణం ఇప్పిస్తానని పరశురాం అనే నిందితుడు మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.లక్షా 87 వేలు వసూలు చేశాడు. ● ఇదే రోజు నీలి శెట్టి సాయిరాం అనే నిందితుడు విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని మండల కేంద్రానికి చెందిన ఇద్దరి వద్ద నుండి ఆన్‌లైన్‌ద్వారా డబ్బులు వసూలు చేశాడు. ● జూన్‌ 1న ఉట్నూర్‌లో నకిలీ బాబా వేషధారణలో ప్రసాద్‌ అనే నిందితుడు ఓ మహిళ వద్ద నుంచి రూ.5 వేల నగదుతో పాటు చెవి కమ్మలు, మాటీలు తీసుకుని పరారయ్యాడు. ● మార్చి 12న గుడిహత్నూర్‌ మండలంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని గణపతి, వరుణ్‌ ఓ నిరుద్యోగ యువతి నుంచి రూ.15 వేలు వసూలు చేశారు. ● ఈనెల 24న విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని జగిత్యాల జిల్లా వాల్గొంకు చెందిన ఏజెంట్లు శ్రీనివాస్‌గౌడ్‌, ఇస్లావత్‌భ్రాకర్‌లు ఇంద్రవెల్లికి చెందిన జాదవ్‌ సురేందర్‌ వద్ద నుంచి రూ.6.51 లక్షలు వసూలు చేశారు. ● 2025 సెప్టెంబర్‌ 28న మైక్రో ఫైనాన్స్‌ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కృష్ణ అనే వ్యక్తి చేసిన మోసం ఉమ్మడి జిల్లాలోనే పెను సంచలనం సృష్టించింది.

నిరుద్యోగులు, సామాన్యులే లక్ష్యంగా మోసాలు ఉద్యోగాలు, సబ్సిడీలు, విదేశాల ఆశ చూపి అక్రమంగా వసూళ్లు స్టాక్‌ మార్కెట్‌ పేరుతోనూ రూ.కోట్ల దందా అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన

ఉట్నూర్‌రూరల్‌: ఒక రోజు ఉట్నూర్‌.. మరుసటి రోజు ఇంద్రవెల్లి.. మరొక రోజు ఇచ్చోడ.. ఇంకోరోజు గుడిహత్నూర్‌.. ఇలా ఏజెన్సీలో ఏ ప్రాంతాన్ని వదలకుండా రోజుకో కొత్త మోసానికి పాల్ప డుతున్నారు. ఏజెన్సీ ప్రాంత అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు పన్నుతున్న మాయాజాలంలో చిక్కి నిరుద్యోగులు, సామాన్యులు నిలువునా మునిగిపోతున్నారు. ఎన్‌ఆర్‌ఐ పేరుతో కృష్ణ మోసాల నుంచి మొదలుకొని, ఇంద్రవెల్లిలో విదేశాలకు పంపిస్తామంటూ చేసిన మోసం వరకు అంతా మోసాల దందాగా సాగుతోంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసులు ఛేదించినప్పటికీ ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా ఒకరిని మించి ఒకరు వినూత్న రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదులతో స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకుని జైలు పాలు చేస్తున్నప్పటికీ, కొత్త మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. బయటపడిన సంఘటనలు కొన్ని మాత్రమే కాగా, పరువు పోతుందనో, భయంతోనో పోలీసుల వరకు వెళ్లని బాధితుల కథలు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement