బాలిక అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

తలమడుగు: మండలంలోని రూయ్యాడి గ్రామానికి చెందిన బాలిక ఆత్రం గంగామణి (4) ఈనెల 27న అదృశ్యమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు. దర్యాప్తులో రుయ్యాడి గ్రామానికి చెందిన నైతం నాగుబాయి బాలికను ఆదిలాబాద్‌ బస్టాండ్‌కు తీసుకువచ్చి ఓ మహిళకు అప్పగించినట్లు సీసీ కెమెరాలో రికార్డయినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు.

ఆదిలాబాద్‌లో ఒకరు..

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన దేశెట్టి వెంకటేష్‌ (47) అదృశ్యమయ్యాడు. పట్టణంలోని సైకిల్‌షాప్‌లో పనిచేస్తున్న ఆయన రోజులాగే సోమవారం షాప్‌కు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కలా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అతని కుమారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

ఖైరిగూర ఓసీకి

ప్రథమ బహుమతి

రెబ్బెన: రక్షణ పక్షోత్సవాల్లో బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ విశేష ప్రతిభ కనబర్చి మూడు ప్రథమ బహుమతులతో పాటు ఒక విభాగంలో ద్వితీయ బహుమతిని సాధించింది. బహుమతి ప్రదానోత్సవాన్ని సోమవారం రాత్రి ఆర్జీ–1 ఏరియాలో నిర్వహించగా ఖైరిగూర ఓసీపీ రక్షణ, ప్రథమ చికిత్స, ట్రస్ట్‌ ఏరియా మైన్స్‌ విభాగాల్లో ప్రథమస్థానంలో నిలవగా, పర్యావరణం విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. సింగరేణి డైరెక్టర్లు సూర్య నారాయణ, వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ చేతుల మీదుగా ఏరియా జీఎం శ్రీరమేష్‌, ఖైరిగూర ఓసీపీ ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్‌ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్‌. తిరుపతి, ప్రాజెక్టు ఇంజినీరు వీరన్న, మేనేజర్‌ శంకర్‌, పిట్‌ కార్యదర్శి మారం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement