బాధ్యతాయుతంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

భీమిని: శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ అన్నారు. సోమవారం కన్నెపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులు పరిశీలించి, రిసెప్షన్‌ సెంటర్‌లోని సిబ్బందితో మాట్లాడారు. కేసుల వివరాలను ఎస్సై విక్రమ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌, తాండూర్‌ సీఐ దేవయ్య, ఎస్సై విక్రమ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement