జన్నారం: విదేశీ విద్య అధ్యయనానికి ఇటీవల ఫిన్లాండ్ వెళ్లివచ్చిన ఉపాధ్యాయులతో ఈ నెల 28న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారంలోని ఇద్దరు ఉపాధ్యాయులకు ఆహ్వానం అందింది. కిష్టాపూర్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ దాముక కమలాకర్, అక్కపెల్లిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్‌కు ఆదివారం ఆహ్వానం అందినట్లు పేర్కొన్నారు. మండల విద్యాధికారి బానవత్ రాజేందర్, కిష్టాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ రాజన్న, జన్నారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయకుమార్ అభినందనలు తెలిపారు.


