మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యూత్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సాంబమూర్తి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో యువతకు భవిష్యత్ ఉంటుందన్నారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మారయ్య మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఆగస్టు 7, 8 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎం.బాబురావు, క్రీడాకారులు పాల్గొన్నారు.


