రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

● ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాలటౌన్‌: రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతన పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా పనిచేసి మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్‌గా రామగిరి బానేష్‌, వైస్‌ చైర్మన్‌గా జాలే రాయలింగు, డైరెక్టర్లుగా బండి తులశేఖర్‌ గౌడ్‌, బద్రి ప్రకాశ్‌, దోమల రమేశ్‌, పురెల్ల పోచమల్లు, బొల్లం సత్యనారాయణ, లగిశెట్టి మనోజ్‌, కొడప కమల, మారు మల్లయ్య, మహ్మద్‌ ఇర్ఫాన్‌, ముడిమడుగుల శ్రీనివాస్‌, అశోక్‌ కుమార్‌ లడ్డ, రావుల మహేశ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగరిగారి ప్రీతం, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివాస్‌, మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటి మేయర్‌ సల్ల రమ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సల్ల మహేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ తూముల నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

సైనికుల త్యాగం ఎనలేనిది

మంచిర్యాలటౌన్‌: కార్గిల్‌ పోరాటంలో భారత సైనికులు చేసిన త్యాగం ఎనలేనిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి చౌరస్తాలో భారత సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి కార్గిల్‌ వీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సల్ల మహేశ్‌, కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, మాజీ ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement