బెల్లంపల్లి: విద్యార్థులకు శుభ్రతతో కూడిన ఆహారం వడ్డించాలని బెల్లంపల్లి సివిల్ కోర్టు జడ్జి శాంతిసోని అన్నారు. ఆదివారం పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈనెల 22న గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 23 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి కిచెన్, స్టోర్ రూమ్, కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసరాలు, విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఫుడ్ ఫాయిజన్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, న్యాయవాదులు టి.గోపి కిషన్‌సింగ్, సీహెచ్.మనోహర్, ఎల్.రాము, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


