మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ నుంచి రాజీవ్‌నగర్‌కు వెళ్లే వందఫీట్ల రోడ్డుపై వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ సెంట్రల్ జోన్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఎన్నికల్లో గెలిచిన నెలరోజుల్లోనే బ్రిడ్జీ నిర్మిస్తానని హామీ ఇచ్చారని, రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదన్నారు. దీంతో టూటౌన్ ప్రాంత ప్రజలు నిత్యం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గాజుల నాయకులు ముఖేశ్ గౌడ్, రంగ శ్రీశైలం, గోపతి రాజయ్య, బొట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, వైద్య శ్రీధర్, బోయిని హరికృష్ణ, బెల్లంకొండ మురళి, తరుణ్‌సింగ్,
తదితరులు పాల్గొన్నారు.


