దండేపల్లి: గూడెంలో సత్యదేవున్ని దర్శించుకుంటున్న భక్తులు
విశ్వనాథస్వామి ఆలయంలో అదనపు కలెక్టర్ దంపతులు
దండేపల్లి: మార్కండేయ ఆలయంలో..
తొలి ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంచిర్యాలలోని విశ్వనాథస్వామి ఆలయానికి వేకువ జామునుంచే భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో ఓపికగా వేచి ఉండి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ చంద్రయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు సత్యదేవున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నూర్‌లోని శివాలయంలో అఖండ అభిషేక పూజలు నిర్వహించారు.
– మంచిర్యాలఅర్బన్


