మంచిర్యాలటౌన్: విద్యార్థులకు అన్నివేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరా ల సురేఖ, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయ ర్ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి పాల్గొన్నారు.
పేదల అభివృద్ధికి కృషి
లక్సెట్టిపేట: పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నా రు. మండల కేంద్రంలోని ఎస్ పీఆర్ ఫంక్షన్ హాల్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారో త్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా చాతరాజు రాజేశ్, డైరెక్టర్లుగా మల్లేశ్, చందు, శ్రీనివాస్, లచ్చన్న, శర త్, భారతమ్మ, నవాబ్‌ఖాన్, తిరుమలరావు, బొజ్జురావు, కట్ల శ్రీనివాస్ చేత మార్కెట్ అధికారి షాబొద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆర్టీయే మెంబర్ శ్రీనివాస్, జిల్లా ఆర్జీపీఆర్‌ఎస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి, వైస్ చైర్మన్ రాజేశ్వరి పాల్గొన్నారు.


