మంచిర్యాలటౌన్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు శనివారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో అనుభవం లేని వారు కూడా తమ నేత గురించి ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు గాదె సత్యం, గోగుల రవీందర్‌రెడ్డి, తోట తిరుపతి, దగ్గుల మధు, పడాల రవీందర్, పెంట నవీన్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
చెన్నూర్: కేటీఆర్‌పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నూర్, కోటపల్లి మండలాల బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంపీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాపు, బీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి విద్యాసాగర్, నాయకులు తిరుపతి, మహేశ్, శ్రీనివాస్, నాయబ్, సురేశ్‌రెడ్డి, రమేశ్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.


