మంచిర్యాలటౌన్: సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ పునరుద్ధరనే ధ్యేయంగా చేపట్టిన జన జాగరణ యాత్ర బైక్ ర్యాలీ శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) నాయకులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును కలిసి తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మౌనదీక్ష చేపట్టారు. టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆగస్టు 23 న హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు అల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి కల్వ ల శ్రీకాంత్, నాయకులు గడ్డం వెంకటేశ్, చంద్రకాంత్, సత్యనారాయణ, అంజన్న పాల్గొన్నారు.


