1098కి స్పందించి..చిన్నారిని బాలసదన్‌లో చేర్పించి.. | - | Sakshi
Sakshi News home page

1098కి స్పందించి..చిన్నారిని బాలసదన్‌లో చేర్పించి..

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

భీమిని: దత్తత పేరుతో బాలుడిని తీసుకువచ్చారనే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదుకు స్పందించిన అధికారులు శుక్రవారం రాత్రి బాలసదన్‌కు చేర్చారు. పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నెపల్లి మండలం గొల్లగట్టు గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు దత్తత పేరుతో వారం క్రితం ఆరునెలల చిన్నారి(మగ) తీసుకువచ్చారు. ఈ విషయమై గ్రామస్తులు 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. స్పందించిన ఐసీడీఎస్‌ అధికారులు పోలీసులతో కలసి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. దత్తతకు సంబంధించిన ఆధారాలు ఏమి లేకపోవడంతో కుటుంబసభ్యులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కన్నెపల్లి ఎస్సై విక్రమ్‌ తెలిపారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సూచనతో చిన్నారిని ఆదిలాబాద్‌ పిల్లల సంరక్షణ (బాలసదన్‌) కేంద్రానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement