ఆదిలాబాద్‌టౌన్: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్ర యత్నం చేసిన ఇద్దరితోపాటు ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. శనివారం ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ టైమ్స్ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులో అభ్యంతరకర పోస్టులు చేసిన బండారి సంతోష్, రాథోడ్ గజానన్, గ్రూప్ అడ్మిన్ వేణుగోపాల్ యాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోష ల్ మీడియా గ్రూప్ అ డ్మిన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని, రెచ్చగొట్టే లేదా విద్వేషాలు రేకెత్తించే పోస్టులను వెంటనే తొ లగించాలని సూచించారు. ప్రజల్లో భ యాందోళనలు సృష్టించే పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.


