బైక్‌లు ఎత్తుకెళ్లిన ఐదుగురు బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఎత్తుకెళ్లిన ఐదుగురు బైండోవర్‌

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

జన్నారం: అటవీ అధికారులు సీజ్‌ చేసిన బైక్‌లను చోరీచేయడమే కాకుండా అడ్డువెళ్లిన సి బ్బందిపై దాడి చేసిన ఐదుగురిని శనివారం తహసీల్దార్‌ బక్కయ్య ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 21న అటవీ అధికారులు కవ్వాల్‌ ఫారెస్ట్‌ క్వార్టర్‌లో రెండు బైక్‌లను సీజ్‌ చేసి ఉంచారు. దేవునిగూడకు చెందిన లాకవత్‌ ఉపేందర్‌, గవ్వల మురళీకృష్ణ, బుక్య సాయి, లాకవత్‌ విక్రం, లాకవత్‌ రాహూల్‌నాయక్‌ కలిసి శుక్రవారం రాత్రి సమయంలో క్వార్టర్‌లోకి చొరబడ్డారు. బేస్‌క్యాంపు వాచర్లపై దాడి చేసి, బైక్‌లను ఎత్తుకెళ్లారని అటవీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement