గొల్లవాగు..ఖాళీ! | - | Sakshi
Sakshi News home page

గొల్లవాగు..ఖాళీ!

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

● నీరు లేక ప్రాజెక్టు వెలవెల ● ఆయకట్టుకు అందని సాగునీరు ● ఎల్‌నినో ప్రభావం..ఆందోళనలో రైతులు

భీమారం: భీమారం సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్ట్‌లో నీరు లేక వెలవెలబోయింది. ఎల్‌నినో తీవ్ర ప్ర భావం, వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు బోసిపోయింది. నీటిమట్టం అడుగుభాగాలకు చేరింది. ఖరీ ఫ్‌ సీజన్‌లో ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భీమారం, చెన్నూరు మండలాల్లోని 9500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం గొల్లవాగు ప్రాజెక్టును నిర్మించింది. దీని ద్వారా సాగునీరందించడంతోనే రైతులు పంటలు పండించేవారు. వేసవిలో నీరు లేకపోవడం, ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా ఇప్పటికి అదే పరిస్థితి ఉంది. అయితే భీమారం మండలం ఆర్కెపల్లి, అంకూసాపూర్‌, ఎలకేశ్వరం, కొత్తపల్లి, మద్దికల్‌ శివారుల్లో రైతులు కాలువ ఆధారంతో వరిసాగు చేస్తున్నారు.

భూములు..బీళ్లుగానే

ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే అవకాశం లేకపోవడంతో రైతుల ఇప్పటికి దుక్కులు దున్నించకుండా బీడుగానే ఉంచారు. ఏటా ఇప్పటికే జూలైలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్ట్‌ జలకళ సంతరించుకునేది. ప్రసుత్తం వర్షం ఎప్పుడు వస్తుందోనని ఆకాశం వైపు ఎదురుచూసే పరిస్థితి ఉంది. ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో పశువులు మేతకోసం వెళ్తున్నాయి. అయితే వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వస్తే ఆలస్యమైన వరి సాగు చేయవచ్చునని రైతులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement