మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

జైపూర్‌: మండలంలోని పెగడపల్లి ఽశివారులో ఓ చెరువు నుంచి శనివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నా రు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తుండగా మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పట్టుకున్నారు. జేసీబీని పోలీస్‌ స్టేషన్‌ తరలించగా ట్రాక్టర్లను డ్రైవర్లు వదిలిపెట్టి పరారైనట్లు తెలిసింది.

పట్టపగలే చోరీ

బాసర: మండల కేంద్రంలోని శారదానగర్‌ కాలనీలో శనివారం ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. షేక్‌ రావుఫ్‌ వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఉదయం ధర్మాబాద్‌కు వెళ్లారు. దుండగులు ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి చొరబడ్డారు. బీరువాలో సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు, 19 తులాల వెండి, రూ.5 వేల నగదును ఎత్తుకెళ్లారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. బాసర సీఐ దీపక్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. షేక్‌ రావుఫ్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

మందమర్రిరూరల్‌: మందమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అందుగులపేట వద్ద నయార పె ట్రోల్‌ బంకు సమీపంలో శనివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై నరేశ్‌ తెలిపిన వివరా ల ప్రకారం.. పట్టణానికి చెందిన సూర వంశీ, మిరియాల రాజ్‌కుమార్‌, రామంచ సందీప్‌ బొక్కలగుంట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద విందు చేసుకున్నారు. బైక్‌పై మందమర్రికి వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నా రు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రెండు ఆటోలు ఢీ..

బోథ్‌: మండలంలోని ధన్నూర్‌(బి) సమీపంలో శనివారం ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఓ ఆటో కూరగాయలతో ఉండగా, మరో ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం బోథ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన సుమను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement