ఆ ఊరే కుటుంబమైంది | - | Sakshi
Sakshi News home page

ఆ ఊరే కుటుంబమైంది

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

● పేద కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయం ● మానవత్వం చాటిన వెంకటాపూర్‌ గ్రామస్తులు

నేరడిగొండ: నిజమైన బంధం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు.. ఒకరి కష్టాన్ని చూసి కదిలిపోయే గుణమని వెంకటాపూర్‌ గ్రామస్తులు నిరూపించారు. దయనీయ స్థితిలో ఉన్న ని రుపేద కుటుంబానికి ఆ ఊరి ఉద్యోగులు, ప్ర జలు కొండంత అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు. మండలంలోని వెంకటాపూర్‌లో అడెల్లి అనే వృద్ధురాలు ఈనెల 21న మృతిచెందింది. ఆమె మరణం ఆ ఇంటా తీవ్ర విషాదాన్ని నింపడమే కాకుండా, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసింది. అంత్యక్రియల ని ర్వహణకు, ఇతర ఖర్చులకు పైసా లేక ఆమె కోడలు వసంత దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆమె ఆవేదనకు చలించిన గ్రామస్తులు, ఉద్యోగులు, యువకులు, పెద్దలు అంతా కలిసి రూ. 25వేల నగదు సేకరించారు. ఆ మొత్తాన్ని మృతురాలి కోడలు వసంతకు శనివారం అందజేశారు.

నగదు అందజేస్తున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement