తెల్లమద్ది @150 ఏళ్లు! | - | Sakshi
Sakshi News home page

తెల్లమద్ది @150 ఏళ్లు!

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

దండేపల్లి: తాళ్లపేట రేంజ్‌ పరిధి దండేపల్లి అటవీ బీట్‌లో సుమారు 150 ఏళ్ల భారీ వృక్షాలు ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. సూదులొద్దీ అటవీ ప్రాంతంలో సుమారు 450 సెం.మీటర్ల చుట్టుకొలత ఉన్న భారీ తెల్లమద్ది(టెర్మినాలియా అర్జున) వృక్షాలు ఉన్నాయి. వీటిని ఏరుమద్ది అని పిలుస్తారని జన్నారం అటవీ డివిజన్‌ అధికారి రాంమ్మోన్‌ తెలిపారు. ఇవి ఎక్కువగా సెలయేరు ప్రాంతాల్లో పెరగడం వల్ల ఏరుమద్ది అని, తొడుగు తెల్లరంగులో ఉండటంతో తెల్లమద్ది అంటారని పేర్కొన్నారు. దీనికి నీటి ప్రవాహాన్ని, నీటి నిల్వలను తట్టుకుంటుందని తెలిపారు. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో పెంచుతారని చెప్పారు. చెట్టు చుట్టూకొలతను బట్టి దాని వయస్సును చెప్పవచ్చని పేర్కొన్నారు.

పేకాడుతున్న 8 మంది అరెస్టు

మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో జోరుగా పేకా ట సాగుతుందని సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ‘ఆపరేషన్‌ పేకాట’నిర్వహించారు. శనివారం సాయంత్రం గాంధీనగర్‌ శివారులోని పేకాటస్థావరం టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై డీకొండ రమేశ్‌ బృందం, స్థానిక ఎస్సై రమేష్‌ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.లక్ష రెండు వేలు నగదు, ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో సీఐ ప్రమోద్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement