నస్పూర్: నస్పూర్ కాలనీలోని శ్రీలక్ష్మి గణపతి శివ మార్కండేయ మహాదుర్గా దేవాలయంలో శాకంబరి యుక్త వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శుక్రవారం చండీహోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 15 నుంచి 23వరకు ఆలయ కమిటీ, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నవరాత్రులు తొమ్మిది రకాల కుంకుమలతో నిత్యం లలిత సహస్రనామ పారాయణంతో కుంకుమార్ఛన, మహా కుంకుమాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల ఆనందశర్మ, శ్రీరాంభట్ల సాత్విక్‌శర్మ, శ్రీరాంభట్ల ఆకాష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


