మంచిర్యాలక్రైం: జువెల్లరి దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో జువెల్లరి దుకాణాలు, మార్కెట్ ఏరియాలో భారీ బందోబస్తు మధ్య ప్రధాన చౌరస్తాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ వాహనం, బైక్‌లు, ప్యాసింజర్ ఆటోల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. జువెల్లరి, బంగారం దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని, ప్రజల భద్రతలో పోలీసులు 24గంటలు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్‌రావు, సత్యనారాయణ, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.


