నెన్నెల: వరినాట్లు వేసే సమయంలో రైతులు శాసీ్త్రయ పద్ధతులు అనుసరిస్తూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. గురువారం మండలంలోని గుండ్లసోమారం, మెట్‌పల్లి, నార్వాయిపేట, చిత్తాపూర్ గ్రామాల్లో వేస్తున్న వరినాట్లను క్షేత్రస్థాయిలో సందర్శించారు. రైతులకు సలహాలు, సూచనలు చేశారు. శాసీ్త్రయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతోపాటు అధిక దిగుబడులు, మెరుగైన నాణ్యత కలిగిన వరిపంటను పొందవచ్చని అన్నారు. నాట్లు వేసే సమయంలో నారు కొనలను తుంచివేయాలని సూచించారు. ముదురు నారు వేయకుండా 20–25 రోజుల వయస్సు కలిగిన నారును మాత్రమే ఉపయోగించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలుగా కందులు, పెసళ్లు, మినుములు, జొన్న, మొక్కజొన్న వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సృజన, ఏఈఓలు పాల్గొన్నారు.


