నార్నూర్: ఓ వైపు గ్రామస్తులంతా ఆకాడి పండుగ సంబరాల్లో మునిగితేలుతుండగా, మరోవైపు ఓ రైతు ఇంటా విషాదం నెలకొంది. సాగు పనుల్లో ఉన్న ఎద్దును పాముకాటేయడంతో మృతిచెందింది. గాదిగూడ మండలం దాబా (కే) గ్రామంలో గు రువారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాదిగూడ మండలం దాబా (కే) గ్రామానికి చెందిన రైతు సోయం మోతిరామ్ పొలంలో ఉన్న ఎద్దును పాముకాటేసింది. చికిత్స అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాసేపటికే మృతిచెందింది. వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉన్న సుమారు రూ.80 వేల విలువైన ఎద్దు మృతితో రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఆకాడి పండుగ రోజే ఈ ఘటన జరగడం గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత రైతుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


