పెంబి: ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు పెంబి మండలం పెంబితండా, ఇటిక్యాల్ తండా గ్రామాల్లో గురువారం ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 లీటర్ల నాటుసారా, 1100 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎన్‌పోర్స్‌మెంట్ సీఐ గంగారెడ్డి తెలి పారు. నిషేధిత గుడుంబా తయారు చేసిన విక్రయించిన చట్టపరమైన కేసులు తప్పవని హెచ్చరించారు. ఎకై ్సజ్ సీఐ నాజీర్ హుస్సేన్ భైంసా స్టేషన్, ఎస్సైలు వసంతరావు, సింధు, సిబ్బంది పాల్గొన్నారు.


