ప్రవేశపరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం 6 నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకు అవకాశం ఎంపికకు నాలుగు దశల్లో ఆన్‌లైన్ పరీక్ష జాతీయ స్థాయిలో నిలిచిన ఇద్దరికి ఏడాదిపాటు భాస్కరా స్కాలర్‌షిప్
నిర్మల్‌చైన్‌గేట్: విద్యార్థుల్లో ప్రతిభ, కొత్త ఆలోచన, ఆవిష్కరణ వెలికితీతకు కేంద్రప్రభుత్వం విజ్ఞాన మంథన్(వీవీఎం) పేరిట జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపినవారికి నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్‌ఐఆర్, ఐఎస్‌ఆర్డీ, బార్క్, డీఆర్డీఓ ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్‌షిప్, స్కాలర్‌షిప్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ వీవీఎంపై విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
వంద మార్కులకు పరీక్ష
సెప్టెంబర్ 1 నుంచి మాక్ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఉంటుంది. ఉత్తీర్ణులకు సెకండ్ లెవెల్(ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్‌లైన్‌లో ప్రోక్టరింగ్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19న ఉంటుంది.
పరీక్ష విధానం
గుర్తింపు పొందిన పాఠశాలలో 6 నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులంతా అర్హులే. సెప్టెంబరు 30వ తేదీలోపు హెచ్‌టీటీపీఎస్://వీవీఎం.ఓఆర్‌జీ.ఇన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా రూ.200, పాఠశాల నుంచి అయితే రూ. 170 ఫీజు చెల్లించాలి. 6, 7 తరగతుల విద్యార్థులు నవంబరు 16న, 8, 9 తరగతులకు 17న, 10, 11 చదివే వారికి 18న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతీ విద్యార్థి తన తరగతికి కేటాయించిన రెండు తేదీల్లో ఏదో ఒకరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు ఎప్పుడైనా పరీక్ష రాయవచ్చు. తొమ్మిది ప్రాంతీయ భాషల్లో ఆసక్తిని బట్టి ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు.
అవగాహన కల్పిస్తున్నాం
విజ్ఞాన్ మంథన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వారితో దరఖాస్తు చేయించేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలి. పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది.
– వినోద్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి, నిర్మల్
దరఖాస్తు విధానం..
https://vvm.org.in వెబ్‌సైట్‌లో పాఠశాలల నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో జ రిగే ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీతో కలి పి 14 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. సె ప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ, అక్టోబర్ 1న లెవల్–1 పరీక్ష ఉంటుంది.
నాలుగు దశల్లో పరీక్ష
1వ దశ (పాఠశాల స్థాయి): ప్రతీ అభ్యర్థికి వీవీఎం ప్రశంసాపత్రం అందిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఆన్‌లైన్ మెరిట్ సర్టిఫికెట్ అందజేస్తారు.
2వ దశ (జిల్లాస్థాయి): జిల్లాస్థాయిలో 6వ తరగతి–11వ తరగతి వరకు ప్రతీ తరగతి నుంచి ముగ్గురిని మొత్తం 18 మందిని ఎంపిక చేస్తారు. వారికి ఆన్‌లైన్ మెరిట్ సర్టిఫికెట్ అందిస్తారు.
3వ దశ (రాష్ట్రస్థాయి): జిల్లా స్థాయిలో ప్రతిభచాటిన వారికి పరీక్ష నిర్వహించి 25 మంది విద్యార్థులకు రాష్ట్రస్థాయి సర్టిఫికెట్ అందిస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.
4వ దశ (జాతీయ స్థాయి): రాష్ట్రస్థాయికి ఎంపికై నవారికి పరీక్ష నిర్వహించి ఇద్దరిని జాతీయ స్థా యికి ఎంపికచేస్తారు. తొలి మూడుస్థానాల్లో నిలి చిన విద్యార్థులకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చొప్పున నగదు బహుమతితోపాటు నేషనల్ అవార్డు అందజేస్తారు. జాతీయస్థాయిలో నిలిచిన ఇద్దరికి ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున భాస్కరా స్కాలర్‌షిప్ అందజేస్తారు.


