ఆలోచనకు పదును..ఆవిష్కరణ వైపు | - | Sakshi
Sakshi News home page

ఆలోచనకు పదును..ఆవిష్కరణ వైపు

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

బాలమేధావులకు చక్కటి అవకాశం 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు ఈనెల 30వ వరకు రిజిస్ట్రేషన్ల గడువు

మంచిర్యాలఅర్బన్‌: విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచన, సృజనాత్మకత.. సమస్యల పరిష్కార నైపుణ్యాల పెంపునకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ (డీఎస్‌టీ)ఆధ్వర్యంలో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సీఎస్‌సీ) పోటీలు నిర్వహిస్తోంది. అన్ని పాఠశాలల యాజమాన్యాలకు చెందిన ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించింది. ఈ ఏడాది థీమ్‌ను ఐదు ఉప అంశాలుగా విభజించింది. యంగ్‌ మైండ్స్‌ ఇన్నోవేటివ్‌ ఐడియాస్‌–సస్టైనబుల్‌ ప్యూచర్‌ అనే నినాదంతో కార్యక్రమాలు సాగనున్నాయి. ప్రతి ప్రాజెక్ట్‌ బృందంలో ఇద్దరు సభ్యులు, ఒక గైడ్‌ టీచర్‌ పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి దోహదం చేసే పోటీలకు ఈనెల 30లోపు రిజిస్ట్రేషన్‌కు తుది గడువు ఉంది.

అంశాలు ఇవి..

ఆహారం–వ్యవసాయం–ఆరోగ్యం, భారతీయ జ్ఞా న వ్యవస్థల వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాలి. చెత్త నిర్వహణ, శక్తి, ఇంధనం, నీటి సంరక్షణ వంటి అంశాలున్నా యి. చెత్త నిర్వహణ (ఆర్‌–5 వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌) ప్లాస్టిక్‌ వ్యర్థాల తగ్గింపు, తడి–పొడిచెత్త రీసైక్లింగ్‌, ఇ–వేస్ట్‌ నిర్వహణ, వ్యర్థాల నుంచి కంపోస్ట్‌ ఎరువు ల తయారీ, సౌర, పవనశక్తి వినియోగం, విద్యుత్‌ ఆదా చేసే పద్ధతులు, వర్షపు నీటి నిల్వ, ఉపయోగించిన నీటి పునర్వినియోగం, నీటి వనరుల ప్రక్షాళన, డ్రిప్‌ ఇరిగేషన్‌ సాంకేతికత, సేంద్రియ సాగు, చిరుధాన్యాల ప్రాముఖ్యత, పోషకాహార లోపాల నివారణ, క్రిమిసంహారక వినియోగం తగ్గించడం వంటి ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఆయురేద్వ, మూలికా వైద్య పద్ధతులు, పురాతన నీటి యాజమాన్య వ్యవస్థలు, సంప్రదాయ సాగు పద్ధతులపై ఆలోచనలకు పదును పెట్టాలి.

సృజనాత్మక ఆలోచనకు అవకాశం

విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించే చక్కటి అవకాశం. ప్రాజెక్టులు ముఖ్యంగా స్థానిక సమస్యలపై సర్వే, పరిశీలన, ప్రశ్నావళికే స్టడీ శాసీ్త్రయ విశ్లేషణల ఆధారంగా రూపొందించాలి. పూర్తి వివరాలకు జిల్లా అకాడమిక్‌ ఆఫీసర్‌ శ్రీమూర్తిని సంప్రదించాలి.

– రాజగోపాల్‌, జిల్లా సైన్స్‌ అధికారి, మంచిర్యాల

ప్రాజెక్టులు రూపొందించడం ఇలా..

చుట్టూపక్కల, సమాజంలో ఉన్న సమస్యను ఎంచుకోవాల్సి ఉంటుంది. సర్వే ఇంటర్వ్యూ లు, ప్రయోగాల ద్వారా సమాచారం సేకరించాలి. సేకరించినవి చార్టులు, గ్రాఫ్‌ రూపంలో విశ్లేషించాలి. సమస్యకు సైన్స్‌ ఆధారిత పరిష్కారాన్ని సూచించాల్సి ఉంటుంది. ప్రా జెక్టు పనితీరు తెలిపే లాగ్‌బుక్‌, నివేదిక త యారు చేయాలి. మొదట జిల్లా స్థాయిలో ప్రె జెంటేషన్‌ ఉంటుంది. ఎంపికై న ఉత్తమ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి వెళ్తాయి. రాష్ట్రం నుంచి ఎంపికై నవి జాతీయస్థాయిలో ప్రదర్శించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement