పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులు | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులు

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

● మొదటి దశలో 50 శాతం మంజూరు ● ఉమ్మడి జిల్లాలోని 87 బడులకు రూ.39,750,00

లక్ష్మణచాంద: పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్యాబోధన, మౌలిక వసతులు, నిర్వహణకు ప్రభుత్వాలు నిధులు విడుదల చేశాయి. 2026–27 విద్యాసంవత్సరం సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఎంపికై న 87 సర్కారు బడులకు మొదటిదశలో 50 శాతం రూ.39,750,00 నిధులు మంజూరయ్యాయి. ఐడీ కార్డుల తయారీ, గణితం, సైన్స్‌ ఎక్స్‌టెన్సన్‌ తరగతుల నిర్వహణ, విహారయాత్రకు తీసుకెళ్లడం, యోగా, ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌ పార్ట్‌టైం టీచర్ల నియామకం, బతుకమ్మ సంబరాలు, కెరీర్‌ గైడెన్స్‌, కౌన్సెలింగ్‌ తరగతులు, కంప్యూటర్‌ ఇన్స్‌స్ట్రక్టర్ల నియామకం వంటి కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. నిధుల మంజూరుపై పాఠశాలల హెచ్‌ఎంలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల సంఖ్యను బట్టి..

పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు కేటాయించారు. 200లో పు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఏడాదికి రూ.75 వేలు, 200 కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్నత పాఠశాలకు ఏడాదికి రూ.లక్ష అందజేస్తారు. ప్రస్తుతం 50 శాతం నిధులు మంజూరయ్యాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి

పీఎం శ్రీ పాఠశాలలు నిర్వహణ నిధులు 50 శాతం విడుదలయ్యాయి. నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి. ఖర్చు చేసిన ప్రతి దానికి వోచర్లు తీసుకుని ఆడిట్‌లో సమర్పించాలి. హెచ్‌ఎంలు విద్యార్థుల కోసం ఖర్చు చేసి ఇబ్బంది లేకుండా చూడాలి.

– భోజన్న, డీఈవో, నిర్మల్‌

ఉమ్మడి జిల్లా సమాచారం

జిల్లాలు పాఠశాలలు మంజూరైన 50శాతం

నిధులు(రూ.లో)

నిర్మల్‌ 20 9,25,000

ఆదిలాబాద్‌ 24 12,00000

మంచిర్యాల 25 10,75,000

కుమురంభీమ్‌ 18 7,75,000

మొత్తం 87 39,750,00

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement