ఆలయ భూమి కేసులో ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూమి కేసులో ఇద్దరి అరెస్ట్‌

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

చెన్నూర్‌: చెన్నూర్‌ జగన్నాథాలయ ఆలయ భూమి కేసులో గురువారం ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ బన్సీలాల్‌ తెలిపారు. ఆలయ భూమిని ఆక్రమించి అందులో నాటిన మామిడి మొక్కలను తొలగిస్తున్న అధికారులపై దాడి చేసిన నూకల సతీశ్‌, కనుకుంట్ల వెంకటరాజంను కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు.

పోక్సోకేసులో ఆటోడ్రైవర్‌ రిమాండ్‌

భైంసారూరల్‌: భైంసారూరల్‌ పో లీసుస్టేషన్‌ పరిధి లో నమోదైన పో క్సో కేసులో ఆటోడ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు త రలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. పోలీసుస్టేషన్‌లో గురువారం సీఐ వివరాలు వెల్లడించారు. ముధోల్‌ మండలం రాంటేక్‌ గ్రామానికి చెందిన రత్నాకర్‌ (26) ఆటోడ్రైవర్‌ భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి, లైంగికంగా వేధించాడని బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించింది. నిందితుడి నుంచి సెల్‌ఫోన్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గొర్రె చోరీ కేసులో నలుగురి అరెస్టు

బెల్లంపల్లి: గొర్రె చోరీ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. బెల్లంపల్లి బూడిదగడ్డబస్తీకి చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ అబ్దుల్లా గొర్రెల పెంపకం చేస్తున్నాడు. అతనికి 10 మేకలు, 4 గొర్రెలు ఉన్నా యి. ఎప్పటి మాదిరిగా అబ్దుల్లా తండ్రి జానీ ఈనెల 20న సింగరేణి ఫంక్షన్‌హాల్‌ పరిసరాల్లో మేతకు మేకలు, గొర్రెలను తీసుకువెళ్లాడు. అందులో రూ.10 వేలు విలువ గల ఒక గొర్రె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కనిపించకపోవడంతో ఈనెల 21న ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్‌హెచ్‌వో.. నలుగురు ఆటోడ్రైవర్లు మంచర్ల రమేశ్‌, గుజ్జ తిరుపతి (చంద్రవెళ్లి), కొట్ల వినోద్‌కుమార్‌ (చాకేపల్లి), ఇడిగిరాల శంకర్‌ (మాల గురిజాల)ను గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి గొర్రెతోపాటు మూడు ఆటోలను ఎస్‌హెచ్‌ఓ రికవరీ చేశారు.

బైండోవర్‌ ఉల్లంఘించిన ఒకరికి జరిమానా

ఇచ్చోడ: మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన సురేందర్‌గౌడ్‌ బైండోవర్‌ ఉల్లఘించినందుకు రూ.50 వేల జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో నరేశ్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సురేందర్‌గౌడ్‌ గతంలో అక్రమ మద్యం విక్రయిస్తుండగా బైండోవర్‌ చేయగా రెండు రోజుల కిత్రం సిరిచెల్మలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో కల్తీకల్లు విక్రయిస్తుండగా మళ్లీ పట్టుబడ్డాడు. అదే తరహా నేరానికి పాల్పడిన బైండోవర్‌ ఉల్లంఘించినందుకు తహశీల్దార్‌ కార్యాలయానికి నివేదించారు. విచారణ అనంతరం సురేందర్‌ గౌడ్‌కు రూ.50 వేల జరిమానా విధించారు.

అడవిపంది దాడిలో పశువుల కాపరికి గాయాలు

ముధోల్‌: అడవిపంది దాడిలో పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కారేగాం గ్రామానికి చెందిన కోనెల ఎర్రన్న రోజుమాదిరిగా గురువారం పశువులను మేపుతూ పొలం వెళ్లాడు. మధ్యాహ్నం అడవిపంది వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా దాడి చేయగా ఎర్రన్న వీపు, కుడి తొడకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన రైతులు అందించిన సమాచారంతో అంబులెన్స్‌ సిబ్బంది భీమ్‌రావు, శేఖర్‌ అక్కడికి చేరుకుని ప్రథమచికిత్స నిర్వహించారు. అనంతరం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement