నర్సాపూర్(జి): మండలంలోని గొల్లమాడ గ్రామంలో మహాలక్ష్మి ఆలయ హుండీ చోరీ చేసిన యువకుడిని అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పోలీసుస్టేషన్ గురువారం డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీని పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పో లీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నర్సాపూర్ (జి) ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు పరిశీలించారు. గు రువారం గుండంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద నిందితుడు, వనపర్తి జిల్లా వీరయ్యపల్లికి చెందిన భరత్ (20) అదుపులో తీసుకున్నారు. అతడి నుంచి రూ.1.15 లక్షలు, 20 తులాల వెండి, 4 గ్రాముల బంగారు ఆ భరణాలు, చోరీకి ఉపయోగించిన ఇనుప క్రోబార్, ఒక బ్యాగు, చేతి గడియారం, బ్లూటూత్ స్పీకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. కాగా, భరత్‌పై గతంలో వనపర్తి జిల్లా పద్ద మందడి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో చోరీ కేసులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. చోరీ కేసు ఛేదించిన ఎస్సై, ప్రత్యేక బృందాన్ని ఎస్పీ జానకీషర్మిల అభినందించారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


