దండేపల్లి: పెద్దపల్లి ఎంపీ వంశీక్రిష్ణ మంచిర్యాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని అంబేద్కర్, దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. మండలంలోని ముత్యంపేట దుర్గ గార్డెన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. గూడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ బ్యాగుల పంపిణీపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా, ఎమ్మెల్యే దూరం పెట్టిన నాయకులను, దళిత సంఘాల్లో కొందరిని మాత్రమే కలుపుకొని కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేతోపాటు తామంతా గెలుపు కోసం పని చేశామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు బాపు, లక్సెట్టిపేట మండల అధ్యక్షుడు రాందాస్, మాజీ మండల అధ్యక్షుడు దొంత నర్సయ్య, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల సర్పంచ్‌లు రాజేశ్వర్, సత్యనారాయణ, శంకరమ్మ, బానేష్, రాందాస్, రాజేష్, నాయకులు నవీన్, వెంకటేష్, రాకేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


