రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

ఖానాపూర్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన గొండాల రంజిత్‌ కుమార్‌ ఆదివారం రాత్రి ఈ–స్కూటీపై ఖానాపూర్‌ నుంచి నిర్మల్‌ వెళ్తుండగా కుమురం భీంచౌరస్తా–ఇక్బాల్‌పూర్‌ మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో మొదట స్థానికంగా చికిత్స అందించి, మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా బ్రెయిన్‌ సర్జరీ చేయాలని, రూ.10 లక్షల వరకు ఖర్చుఅవుతుందని తెలిపారు. దాతలు మానవత్వంతో స్పందించి చేతనైనంత ఆర్థిక సాయం అందించి యువకుడి ప్రాణాలు కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతలు 9000524553 నంబర్‌కు ఫోన్‌పే ద్వారా ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో జిల్లావాసికి గాయాలు

లక్ష్మణచాంద: అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువ ఇంజినీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాఽ దిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నర్సాపూ ర్‌ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీని వాస్‌రెడ్డి, విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానందరెడ్డి ఎంఎస్‌ చేసేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రం లోని డెట్రాయిట్‌కు వెళ్లాడు. ఎంఎస్‌ పూర్తి కావడంతో అక్కడే ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ రాగి తీగ చోరీ

తాండూర్‌: మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో అమర్చిన ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి కాపర్‌ వైర్‌, ఆయిల్‌ అపహరించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం కావడంతో పంట పొలాల్లోని బోర్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం వరినారు మడులకు నిత్యం నీరు పెట్టాల్సి ఉంది. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం ఘటనపై రైతులు పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ అమర్చి విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

సారంగపూర్‌: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చో టు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని చించోలి(బి) గ్రామానికి చెందిన ఆడెపు నరేష్‌ (31) తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. ఇంటికి పెద్దకుమారుడైన నరేష్‌ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా డు. ఈ క్రమంలో కుటుంబ పోషణకు అప్పులు చేసినట్లు బాధితుడి తల్లి లక్ష్మి, సోదరుడు నవీన్‌ తెలిపారు. మంగళవారం గ్రామ సమీ పంలోని గండిరామన్న హరితవనం ఎదుట గల ఈద్గాకు వెళ్లే దారిలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వసంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement