మంచిర్యాలక్రైం: పోలీస్ అధికారులు కేసుల విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మంచిర్యా ల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తని ఖీ చేశారు. సిబ్బంది పనితీరు, హెల్ప్‌లైన్ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు రికార్డులు పరిశీలించారు. 24గంటలు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం ఆయుధాలతో తనిఖీ చేయాలని అన్నారు. నగర ప్రజలు, వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు పాల్గొన్నారు.


