రైతులను పట్టించుకోని ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులను పట్టించుకోని ప్రభుత్వం

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

● బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సాగునీటి నుంచి యూరియా బస్తాల వరకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు విద్యుత్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ● చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. ● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో 34 హామీలు ఇచ్చి అమలు చేయలేదని తెలిపారు. కష్టాలతో రైతులు కాలం వెళ్లదీస్తున్నారని, ప్రభుత్వం నుంచి స్పందన లభించడం లేదని అన్నారు. ● అనంతరం మండలంలోని రంగపేట గ్రామానికి చెందిన చిప్పకుర్తి నారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనానికి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, రమణారావు, చందర్‌, కోనేరు కోనప్ప, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, సంజయ్‌కుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రైతు సదస్సులో కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన రైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ

లక్సెట్టిపేట: నలుగురు రైతులు మృతిచెందినా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, సహాయం అందించలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. మండలంలోని అంకతిపల్లి గ్రామ సమీపంలో ఉన్న వాసవి ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత మే నెలలో గోడ కూలి మృతిచెందిన నాగరాజు, అభిరామ్‌, వెంకటేష్‌, లచ్చన్న కుటుంబాలకు పార్టీ ఆధ్వర్యంలో రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కాశేళ్వరం ప్రాజెక్టు, నీటి ప్రవాహంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రైతులకు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ హయాంలో రైతులను అభివృద్ధి చేశామని అన్నారు.

గూడెంలో పూజలు..

దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారాయణస్వామిని కేటీఆర్‌ మంగళవారం దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి లక్సెట్టిపేటలో జరిగే రైతు సదస్సుకు వెళ్తున్న ఆయన గూడెం గుట్టపైకి వెళ్లారు. సత్యనారాయణస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశ్వీరచనం చేయగా, ఈవో శ్రీనివాస్‌ లడ్డు ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, సుమన్‌, నాయకుడు విజిత్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement