మూడు దఫాల్లో డిగ్రీలో మిగిలిన 815 సీట్లు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 37.5శాతం ఖాళీలు ఈ నెల 26వరకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి దోస్త్ మూడో దఫా ప్రక్రియ ముగిసింది. నాణ్యమైన ఉచిత విద్య, ఆధునిక ల్యాబ్‌లు, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, స్కాలర్‌షిప్‌ల సౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం, ఇతర కోర్సుల్లో చేరడం వల్ల ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదని తె లుస్తోంది. ఈ ఏడాది 37శాతం సీట్లు ఖాళీగా మిగి లిపోయాయి. నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2,200 సీట్లకు 1,385 సీట్లు భర్తీ కాగా 815సీట్లు ఖా ళీలు ఉన్నాయి. మూడు దశలు ముగిసిపోగా ప్రత్యే క దశ ఈ నెల 26వరకు రిజిస్ట్రేషన్ల్లు, 27న వెబ్ ఆప్షన్ ముగియనున్నాయి. మూడు దఫాలతోపాటు ప్రత్యేక దశకు మాత్రమే స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంటు వర్తించనున్నాయి. దరఖాస్తులకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.
కళాశాలల్లో సీట్ల భర్తీ..
జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారీగా ప్రవేశాలు చూస్తే అత్యధికంగా 290 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చెన్నూర్‌లో 230 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. డిగ్రీ కళాశాలల వారీగా మంచిర్యాలలో 420 సీట్లకు గాను 145, లక్సెట్టిపేటలో 720కి గాను 150, బెల్లంపల్లిలో 520కి గాను 290, చెన్నూర్‌లో 540కి గాను 230 సీట్లు మిగిలిపోయాయి. ప్రత్యేకంగా బెల్లంపల్లి, చెన్నూర్ ప్రాంతాల్లో వందలాది సీట్లు ఖాళీగా ఉండడంతో మిగతా ప్రత్యేక దశ కౌన్సెలింగ్‌లోనైనా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
కళాశాల కోర్సుల వారీగా ఖాళీలు..
కోర్సులు చెన్నూర్ మంచిర్యాల లక్సెట్టిపేట బెల్లంపల్లి
బీకాం 70 40 45 35
బీకాం(బీఎఫ్‌ఎస్‌ఐ) 30 25 20 20
బీఎస్సీ–లైఫ్ 25 25 25 35
బీఎస్సీ, ఫిజిక్స్ 35 30 35 35
బీఏ 25 25 25 25
చెన్నూర్ బీకాం రిటైల్ మేనేజ్‌మెంట్‌లో 45 సీట్లు ఖాళీగా ఉన్నాయి


