వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలి

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

● రోడ్డు ప్రమాదాలు నివారించాలి ● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో రహదారులపై బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి వీధి దీపాలు, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందారం వంతెన నుంచి గోదావరి వంతెన వరకు వీధి దీపాల ఏర్పాటు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ నిర్వహణ, యూ టర్న్‌ల పునః వ్యవస్థీకరణ వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ ఏ.భాస్కర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ అన్నా రు. మంగళవారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి అదనపు కార్యదర్శి ఇలంబర్తి, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, డీసీపీ ఏ.భాస్కర్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement