ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నా రు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌, ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సమాచారం సేకరించాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తులు స్వీకరించి త్వరితగతిన పరిశీలించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ఎన్యూమరేష న్‌ ఫారాల డిజిటలైజేషన్‌ వేగవంతంగా చేస్తున్నామ ని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) పి.చంద్ర య్య, డీఆర్వో అధికారి మోతిరామ్‌, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement