వేసవి క్రీడల శిక్షణకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

వేసవి క్రీడల శిక్షణకు వేళాయె..

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

నేటి నుంచి 31వరకు శిక్షణ శిబిరాలు

పట్టణ ప్రాంతాల్లో నామమాత్రపు ఫీజు

గ్రామీణ ప్రాంతాల్లో ఉచితం

సెలవులు సద్వినియోగం చేసుకోనున్న చిన్నారులు

మంచిర్యాలటౌన్‌: ప్రతీయేటా వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటి నుంచి 31వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రీడల్లో శిక్షణకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పట్టణ ప్రాంతాల్లో అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, కరాటే, కబడ్డీ, బ్యాడ్మింటన్‌కు శిక్షణకు నామమాత్రంగా రూ.100 చొప్పున, బాస్కెట్‌బాల్‌కు రూ.300, బ్యాడ్మింటన్‌కు రూ.500 ఫీజు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో 11, గ్రామీణ ప్రాంతాల్లో 10 శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఆటల్లో ఆసక్తి ఉండి నేర్చుకోవాలనే తపన ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులు, పీడీలు, సీనియర్‌ క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. నెల రోజులపాటు 14రకాల క్రీడల్లో ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు శిక్షణ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 14ఏళ్లలోపు బాలబాలికలు మాత్రమే అర్హులు. క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే పిల్ల లకు ఆటల్లో ప్రావీణ్యం లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement