ఇళ్ల నిర్మాణాలు అడ్డుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలు అడ్డుకోవద్దు

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

వేమనపల్లి: సుంపుటం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవద్దని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అటవీ శాఖ అదికారులకు సూచించారు. ఇటీవల సుంపుటం గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సంతోష్‌కుమార్‌, స్థానిక సర్పంచు దుర్గం భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో గురువారం అదనపు కలెక్టర్‌ అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ రికార్డులు పరిశీలించి గ్రామం రెవెన్యూ పరిధిలో ఉందని, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నీల్వాయిలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బుయ్యారం, నాగారం గ్రామాల్లో పర్యటించారు. డీఎల్‌పీఓ సతీష్‌, ఎంపీడీఓ కుమారస్వామి, డీటీ సాయికృష్ణ, ఎఫ్‌ఆర్‌ఓ దయాకర్‌, సర్పంచులు భాగ్యలక్ష్మి, చెన్నూరి సమ్మయ్య, కొండి మానస, ముల్కల్ల శ్రీలత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement