నగర కమిషనర్‌గా రాజు | - | Sakshi
Sakshi News home page

నగర కమిషనర్‌గా రాజు

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జి.అన్వేష్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జి.రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్వేష్‌ను వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది.

‘రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం’

జన్నారం: రైతుబంధు ఇవ్వడంలో, ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, రైతులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు రితీష్‌రాథోడ్‌ అన్నారు. గురువారం జన్నారంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. వెంటనే వడ్లు కొనాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జి.మధుసూదన్‌రావు, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బద్రి నాయక్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, నాయకులు గోలి చందు, ఎం.వీరాచారి, అప్పాల జలపతి, ఎస్‌.పవన్‌ కుమార్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement