చెన్నూర్: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాల లబ్ధిదారులు 144 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి అందజేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని అన్నారు. రెండో విడత మరో 2500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులకు నేరుగా మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం చెన్నూర్ మండలం పొక్కూర్ సర్పంచ్ ఐత స్వరూప, సత్తయ్య మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బెల్లంకొండ కరుణసాగర్‌రావు, మాజీ సర్పంచ్ గొడిసెల బాపురెడ్డి పాల్గొన్నారు.
నిరుపేదల కోసమే ఇదిరమ్మ ఇళ్ల పథకం
చెన్నూర్‌రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. మండలంలోని బావురావుపేట గ్రామంలో ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ ప్రవేశంలో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం సత్ఫలితాలు ఇస్తోందని, నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. బావురావుపేట నుంచి కత్తెరసాల, కాచన్‌పల్లి వరకు వంతెన నిర్మాణాల కోసం సుమారు రూ.5కోట్లు మంజూరు చేసినట్లు తెలిపా రు. సర్పంచ్ తాటి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.


