● కొత్త డీఎఫ్‌వోగా రాహుల్ కిషన్ జాదవ్ నియామకం
మంచిర్యాలక్రైం: రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖలో 12మంది జిల్లా అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్‌సింగ్ బదిలీ అయ్యారు. రెండున్నరేళ్లుగా ఇక్కడ పని చేస్తున్న ఆయనను మహబూబ్‌నగర్ జిల్లా అటవీశాఖ అధికారిగా నియమించారు. ఆయన స్థానంలో ఇక్కడికి ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్(2018 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్)ను బదిలీ చేశారు. కాగా, 2022 సెప్టెంబర్ 14న శివ్ ఆశిష్‌సింగ్ జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అర్బన్ పార్క్ అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, జాప్యం చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.


