ఆర్జీయూకేటీలో టీజీసీహెచ్‌ఈ కమిటీ పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో టీజీసీహెచ్‌ఈ కమిటీ పర్యటన

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

బాసర: బాసర ఆర్జీయూకేటీని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) కమిటీ సభ్యులు సందర్శించారు. క్యాంపస్‌లోని విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏబీ3 భవనంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, అకడమిక్‌ క్యాలెండర్‌ అమలు, వసతుల లేమిపై విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను కమిటీ సభ్యుల దృష్టికి విద్యార్థులు నేరుగా తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ కమిటీ సభ్యులు వినతిపత్రాలు అందజేశారు. నివేదికను ప్రభుత్వానికి అందజేసి సమస్యల శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement