జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు హాజీపూర్‌ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన వడ్డపెల్లి రవీందర్‌ (40) మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. కిస్తీలు రెగ్యులర్‌గా కట్టలేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తితో బుధవారం ఉదయం ఇంటి ముందున్న బాల్కనీలో చీరతో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య రమ, కుమారుడు అక్షిత్‌, కుమార్తె వైశాలి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

నిర్మల్‌ కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

నిర్మల్‌చైన్‌గేట్‌: తాను పండించిన పంటను అదే గ్రామానికి చెందిన వ్యక్తి కోయనీయకుండా అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తూ నిర్మల్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సారంగపూర్‌ మండలం ఆలూరుకు చెందిన గజ్జ శ్రీధర్‌ తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, వరి సాగు చేశానని, పంటను కోయనీయకుండా, అమ్మ నియకుండా అదే గ్రామానికి చెందిన వ్యక్తి అడ్డుపడుతున్నాడని వాపోయాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి కలెక్టరేట్‌ ప్రాంగణంలో పడిపోయాడు. గమనించిన సిబ్బంది 108కు సమాచారం అందించడంతో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భార్య చేతిలో భర్త హతం

ఆదిలాబాద్‌రూరల్‌: భార్య చేతిలో భర్త హతమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లోహరకు చెందిన సొలంకే గణపతి (54) కుల వృత్తి కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతీరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి అతని భార్య మథుర బాయితో గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవలో మథురబాయి రాడ్‌తో కొట్టడంతో తీవ్రగాయాలపాలైన గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సొలంకే సురేష్‌ ఫిర్యాదు మేరకు మథురబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement