నిర్మల్‌టౌన్: పట్టణానికి చెందిన కొప్పుల విజయ,సంజయ్ దంపతుల కుమారుడు కొప్పుల అర్జున్ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి టోర్నమెంట్లలో మొత్తం 100 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 85 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించి అబ్బుర పరిచాడు. 14 సంవత్సరాల వయసులో ఈ మైలురాయిని అందుకున్న మొదటి వ్యక్తి జిల్లా వాసి కావడం గర్వకారణంగా ఉందని పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా కోచ్‌రామరాజు అర్జున్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
స్క్రాప్ దొంగ అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని కృష్ణానగర్‌లో గల స్క్రాప్ గోదాంలో చోరీకి పాల్పడిన నింది తుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ని ఖార్ అహ్మద్ అనే వ్యక్తి కృష్ణానగర్‌లో స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం దు కాణంలో వెళ్లి చూడగా గోదాములో సామగ్రి తక్కువగా కనిపించింది. సీసీ కెమెరాలను పరి శీలించగా 15 రోజులుగా మసూద్‌నగర్‌కు చెందిన షేక్ తబ్రేజ్ అనే వ్యక్తి చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
కలెక్టరేట్ ఎదుట రైతు ఆమరణ దీక్ష
కై లాస్‌నగర్: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, పూర్తిస్థాయిలో రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కిషోర్‌రావు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. రబీ రైతుభరోసా విడుదలలో జాప్యం చేయకుండా తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ డిమాండ్లను అమలు చేయని పక్షంలో రైతులను సంఘటితం చేసి ఉద్యమిస్తానని స్పష్టం చేశారు.


